NTR, Mahesh Babu: ‘అన్స్టాపబుల్’ విషయంలో ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ ఏంటో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు… ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఊహించని విధంగా బుల్లితెర పై అలాగే ఓటిటి పై సందడి చేయడానికి ముందుకొచ్చాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి గెస్ట్ గా వెళ్ళాడు. నిన్న ప్రసారమైన ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మహేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్… ఎన్టీఆర్ వాక్చాతుర్యం కలగలిపి ఈ ఎపిసోడ్ ను బ్లాక్ బస్టర్ ను చేసాయి.

కచ్చితంగా ఈ ఎపిసోడ్ కు మంచి టి.ఆర్.పి నమోదయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు బార్క్ వారు. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రమే కాదు బాలయ్య ఆహా వారి కోసం చేస్తున్న ‘అన్స్టాపబుల్’ కు కూడా మహేష్ బాబు గెస్ట్ గా వెళ్ళాడు. ఆ ఎపిసోడ్ అతి త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ ఎపిసోడ్ కూడా మంచి వ్యూయర్ షిప్ నమోదయ్యే అవకాశం ఉంది. అంతా బానే ఉంది కానీ ఇప్పుడు మహేష్ వల్ల ఎన్టీఆర్ కు ఓ విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.

విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్.. అన్స్టాపబుల్ కు వెళ్తాడా లేదా అని ప్రేక్షకుల ధర్మ సందేహం. తాను ఒక్కడిగా కాకపోయినా ‘ఆర్.ఆర్.ఆర్’ టీంతో వెళ్లే ఆస్కారం ఉంది. ఆ ఎపిసోడ్ గురించి అటు ఆహా వారు కానీ ఇటు ఆర్.ఆర్.ఆర్ టీం కానీ ఏమీ చెప్పడం లేదు. అసలే బాలయ్య- ఎన్టీఆర్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది ఎప్పటినుండో ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. అది అబద్దం అనేవారు కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ అన్స్టాపబుల్ కు వెళ్లి సందడి చేస్తే ఎటువంటి గొడవ ఉండదు. చివరికి ఏమవుతుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus