గత రెండు నెలల పైనుండే లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతింది. థియేటర్లు మూతపడటంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎన్నో ఆగిపోయాయి. ఇక షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఎలాగైనా కొన్ని నిబంధనలతో తిరిగి షూటింగ్ లు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండీ పెర్మిషన్లు తెచ్చుకోవడానికి ఎన్నో మీటింగ్ లు నిర్వహించారు. చిరంజీవి, నాగార్జున లతో పాటు ఎంతో మంది నిర్మాతలు కూడా ఈ మీటింగ్స్ లో పాల్గొన్నారు.
అయితే ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిన బాలయ్యను ఆహ్వానించలేదని… ఆయన నిన్న ఫైర్ అయ్యాడు.’అన్ని మీటింగ్లలో ఒక్క మీటింగ్ కు కూడా తనని ఆహ్వానించలేదని.. తలసానితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?’ అంటూ కామెంట్స్ చేసాడు బాలయ్య. దానికి నాగబాబు.. బాలయ్య పై సెటైర్లు వేస్తూ యూట్యూబ్ లో ఓ వీడియోని పోస్ట్ చేసాడు. ఆ వీడియోలో ‘బాలయ్య నోరు అదుపులో పెట్టుకో’ అంటూ ఓ వీడియోని విడుదల చేసాడు. ఈ వీడియో చూసిన నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఎన్టీఆర్ వరకూ కూడా ఈ వీడియో వెళ్ళిందట. ఈ వీడియో చూసిన ఎన్టీఆర్.. నాగబాబు పై ఫైర్ అయ్యాడట. గత కొంతకాలం నుండీ మెగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నాడు. చరణ్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. దాంతో చరణ్ ను కలిసి ఎమన్నా ఉంటే.. ‘మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా బయట రచ్చ చేయడం సరైనది కాదు’ అంటూ చరణ్ తో చెప్పాడట ఎన్టీఆర్.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్