Jr NTR: ప్రశాంత్ నీల్ సినిమాకి ఎన్టీఆర్ సైతం.. ఆ విధానాన్ని నమ్ముకున్నాడా?

‘బాహుబలి’ (Baahubali) తో ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని మార్కెట్ 10 రెట్లు పెరిగింది. అందువల్ల అతను పెద్ద బడ్జెట్ సినిమాలే ఒప్పుకుంటున్నాడు. అతను సినిమాకి వచ్చి రూ.100 కోట్ల నుండి రూ.150 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. అయినా నిర్మాతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే.. ప్రభాస్ సినిమాకు పెట్టిన బడ్జెట్ రికవరీ చేసుకోవడం చాలా ఈజీ. మరోపక్క ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. 2023 జూన్ నుండి 2024 వరకు చూసుకుంటే.. అతను 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

Jr NTR

అందులో 2 హిట్లు. ఈ ఫీట్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. అయితే ప్రభాస్ ఇన్ని సినిమాలు ఎలా కంప్లీట్ చేస్తున్నాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. చాలా మంది దగ్గర దీనికి సరైన సమాధానం ఉన్నా? లేకపోయినా? ‘బాడీ డబుల్స్’ తో సినిమాలు కంప్లీట్ చేసేస్తున్నాడు అని అంటున్నారు. కొంతవరకు ఇది నిజం కూడా..! డైరెక్టర్ లుక్ టెస్ట్ చేసినప్పుడే.. కొలతలు వేసి.. బడీ డబుల్స్ ను కూడా సెట్ చేసుకుంటున్నారు.

దాని వల్ల సైడ్ యాంగిల్ షాట్స్, బ్యాక్ సైడ్ షాట్స్ తీసేయొచ్చు. క్లోజప్ షాట్స్ కోసం మాత్రం ప్రభాస్ కావాలి. ఇప్పుడు ఇదే పద్ధతిని ఎన్టీఆర్ (Jr NTR)  కూడా అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. ‘దేవర’ లోని (Devara)  చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్టీఆర్.. బాడీ డబుల్ తో చేయించినవే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాకి కూడా ఎక్కువగా అదే పని చేస్తున్నారు అని వినికిడి.

వాస్తవానికి ఈ పద్ధతి బాలీవుడ్ నుండి తెచ్చుకున్నదే. అక్కడ హృతిక్ రోషన్ (Hrithik Roshan), సల్మాన్ ఖాన్ (Salman Khan), షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వంటి హీరోలు ఎక్కువగా బాడీ డబుల్స్ తో సినిమాలు కంప్లీట్ చేసేస్తారు. తెలుగులో ‘బాహుబలి’ వరకు ఎక్కువగా డూప్స్ ని వాడేవారు. కానీ అది ఎక్కువగా కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. నిర్మాతలు, దర్శకులు హీరో డేట్స్ కోసం ఎదురు చూడకుండా సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus