Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ లో పునీత్ ని తలుచుకున్న ఎన్టీఆర్!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ మొత్తం బెంగుళూరులో ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ ను తలచుకొని జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ ఇటీవల కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయనతో ఎన్టీఆర్ కి మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పునీత్ తో ఎన్టీఆర్ కి ఉన్న సాన్నిహిత్యం గురించి మీడియా ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ లేని కర్ణాటకను ఊహించుకోలేకపోతున్నానని.. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. ఆ తరువాత పునీత్ కోసం ఎన్టీఆర్ పాడిన ‘గెలయా.. గెలయా..’ పాటను మరోసారి పాడి పునీత్ పై ప్రేమను వ్యక్తపరిచారు. ఇకపై ఈ పాట పాడనని చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. పునీత్ చాలా గొప్ప వ్యక్తి అని.. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు.

ఆయన ఎక్కడున్నా.. ఆయన ఆశీస్సులు మాత్రం తమపై ఉంటాయని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. 46 ఏళ్ల పునీత్ అక్టోబర్ 29న కన్నుమూశారు. ఆయన మరణవార్త ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. టాలీవుడ్ కి చెందిన పెద్దలు కూడా పునీత్ చివరిచూపు కోసం బెంగుళూరుకి వెళ్లారు. దాదాపు పది లక్షల మంది అభిమానులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus