Jr NTR: ఆ దర్శకునికి తారక్ ఛాన్స్ ఇచ్చారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే సంగతి తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరుసగా విజయాలను అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లలో వెట్రిమారన్ ఒకరు.

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వెట్రిమారన్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్నారు. అసురన్ సినిమాతో వెట్రిమారన్ జాతీయస్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. అసురన్ తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ కాగా తెలుగులో ఈ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం వెట్రిమారన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.

యంగ్ టైగర్ వెట్రిమారన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్టీఆర్ కు కూడా అవార్డు రావడం గ్యారంటీ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ తరువాత ప్రాజెక్ట్ లు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus