యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత కష్టమైన పనినైనా మొండి ధైర్యంతో చేయడానికి రెడీ అవుతుంటాడు. ఈ క్రమంలో పలు సార్లు గాయాల పాలయ్యాడు కూడా..! ముఖ్యంగా కొన్ని సినిమాల షూటింగ్ల టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే పైనున్న వాళ్ళ తాతగారు నందమూరి తారకరామారావు గారి ఆశీస్సుల వలనో.. లేక ఆయన అభిమానుల ప్రేమ వలనో కానీ… ఎన్టీఆర్ కు ఎటువంటి హాని కలగలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అయినప్పటికీ ఇతను షూటింగ్ స్కిప్ చేసేవాడు కాదు. బ్యాండేజ్ లు, కట్లు వంటివి ఉన్నప్పటికీ షూటింగ్ లలో పాల్గొనేవాడు.అది అతని డెడికేషన్. ఇంకో విచిత్రం ఏమిటంటే..
ఎన్టీఆర్ కు ఏ సినిమాల షూటింగ్ టైం లో గాయాలపాలయ్యాడో.. ఆ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. సరే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఏ ఏ సినిమాల షూటింగ్ ల టైంలో గాయపడ్డాడో ఓ లుక్కేద్దాం రండి :
1) స్టూడెంట్ నెంబర్ 1 :
నిజానికి రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమానే ఎన్టీఆర్ కు మొదటి సినిమా అయ్యుండాలి..! కానీ ఓ షెడ్యూల్ లో ఎన్టీఆర్ గాయపడటంతో షూటింగ్ చాలా రోజులు డిలే అయ్యింది. అయినప్పటికీ ఎన్టీఆర్ కు మొదటి హిట్ ను అందించింది ఈ చిత్రం.
2) ఆది :
వి.వి.వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే చేతికి కత్తి ఉండగానే ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అనే పాట షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇది బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
3) సింహాద్రి :
రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
4) సాంబ :
వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్ గాయపడ్డాడు. కానీ ఇది యావేరేజ్ మూవీగా నిలిచింది.
5) యమదొంగ :
రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయినప్పటికీ ఇది సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు వాటికి బ్రేక్ వేసిన సినిమా ఇది.
6) అదుర్స్ :
వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్ కు గురయ్యింది. షూటింగ్ ముగించుకుని టీడీపీ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అయినా సినిమా హిట్ అయ్యింది.
7) బృందావనం :
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ చిత్రం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే సినిమా సూపర్ హిట్ అయ్యింది.
8) ఊసరవెల్లి :
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసిన రెండో సినిమా ఇది. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా పాటను చిత్రీకరిస్తున్న టైములో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఈ సినిమా యావరేజ్ రన్నర్ గా నిలిచింది.
9) శక్తి :
కొన్ని అనవసరపు యాక్షన్ సీన్లు చిత్రీకరించిన టైంలో ఎన్టీఆర్ గాయపడ్డాడు. ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సీన్లు ఎడిటింగ్ లో లేపేశారు. ఇది ఓ డిజాస్టర్ మూవీ.
10) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ స్పాట్ లో ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే.