న్యాచురల్ స్టార్ నాని రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంది. రాహుల్ సాంకృత్యాన్ సినిమాలలో స్క్రీన్ ప్లే ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ కొత్త సినిమలేవీ ప్రకటించలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రాహుల్ సాంకృత్యాన్ కొత్త సినిమాలో తారక్ హీరోగా నటించనున్నారు.
రాహుల్ చెప్పిన కథ అద్భుతంగా ఉండటంతో పాటు తారక్ కు ఎంతగానో నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. నెవర్ బిఫోర్ రోల్ లో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.
తారక్ (Jr NTR) ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను నిర్మిస్తున్న మైత్రీ నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన వస్తే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రాహుల్ సాంకృత్యాన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కావడంతో పాటు ఎన్టీఆర్ కు భారీ హిట్ ను ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే ఓకే చెప్పిన మూడు సినిమాలు పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో తారక్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!