Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ తర్వాత 9 నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. దేవర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసిన తారక్ ఒకే సమయంలో వార్2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. ఈ మూడు సినిమాలు తారక్ రేంజ్, క్రేజ్ ను మరింత పెంచే సినిమాలు అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే బాల రామాయణం సినిమా షూట్ సమయంలో తారక్ తనతో ఉండే తోటి పిల్లలకు హర్రర్ కథలు చెప్పి భయపెట్టేవారట. ఆ పిల్లలు తారక్ చెప్పిన కథలు విని భయంతో ఏడ్చేవారట. తారక్ కు నటనలో శిక్షణ ఇచ్చిన భిక్షు ఒక సందర్భంలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు తారక్ కు కథలు చెప్పి పిల్లల్ని భయపెట్టే టాలెంట్ కూడా ఉందా అని కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా భవిష్యత్తులో కూడా తారక్ ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం రూల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వార్2 మూవీ విడుదలైన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ రిలీజయ్యేలా తారక్ ప్లానింగ్ ఉందని బోగట్టా.

తన సక్సెస్ రేట్ మరింత పెరిగే విధంగా (Jr NTR) తారక్ అడుగులు పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో భారీ సినిమా దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ ను, రేంజ్ ను మరింత పెంచే విధంగా తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. తారక్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus