నీకు నాకు ఏమీ కాదు.. వీడియో కాల్ లో అభిమానితో ఎన్టీఆర్..!

అభిమానుల యోగ క్షేమాలను తెలుసుకోవడంలోనూ..అలాగే వారు కనుక ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడడానికి.. మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని మరోసారి ప్రూవ్ అయ్యింది. గతేడాది మహేష్ బాబు, వెంకటేష్ వంటి హీరోలు అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను పరామర్శించేందుకు నేరుగా వాళ్ళ ఇళ్ళకు వెళ్లారు. అభిమానుల ఆనందం కోసం పరితపించే హీరోల్లో మన ఎన్టీఆర్ కూడా ముందుంటాడు. ఇప్పుడు అతని వంతు వచ్చింది. ‘వెంకన్న అనే ఎన్టీఆర్ వీరాభిమాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.ఈ విషయాన్ని తన అభిమానులు మరియు తన టీం ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ నేరుగా వెంకన్నకు వీడియో కాల్ చేసి అతనికి ధైర్యం చెప్పాడు.

ఎన్టీఆర్ అతనికి వీడియో కాల్ చెయ్యడంతో… ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. మీరు నాకు ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు. ఇంకేమీ వద్దు’ అంటూ వెంకన్న.. ఎన్టీఆర్ ను కోరాడు. ‘కరోనా వ్యాప్తి తగ్గిన వెంటనే మనిద్దరం సెల్ఫీ దిగుదాం.అప్పటివరకూ నువ్వు బలమైన ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకోవాలి’ అంటూ ఎన్టీఆర్.. వెంకన్నకు సూచించాడు. ‘మిమ్మల్ని కలవాలనే ఒకే ఒక్క ఆశతోనే బ్రతుకుతున్నాను’ అంటూ వెంకన్న పలుకగా.. దానికి ఎన్టీఆర్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ”అయ్యయ్యో… నీకు, నాకు ఏమీ కాదు…! మనం ఇక్కడే ఉంటాం.

నీ ఆరోగ్యంతో పాటు మీ అమ్మ గారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో” అంటూ ఎన్టీఆర్.. వెంకన్నను కోరాడు. అటు తరువాత వెంకన్న తల్లి కూడా ఎన్టీఆర్ తో మాట్లాడారు. ‘నా కొడుకు ఆరోగ్యం కోసం చాలా చోట్లకు తిరిగాము.. అయినా ఫలితం లేకపోయిందని’ ఆవేదన వ్యక్తం చేశారు.తరువాత వెంకన్న తల్లితో ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘నేనున్నాను.. తప్పకుండా సాయం చేస్తాను.మీ అబ్బాయిని బాగా చూసుకోండి. నేను తప్పకుండా కలుస్తాను. నీ సంతోషమే నీకు రక్ష వెంకన్నా!” అంటూ వారికి ధైర్యం చెప్పాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus