తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ పెళ్లి కాకముందు ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు కాబోయే భార్య గురించి కొన్ని విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఒక్కరికి కూడా తమ లైఫ్ పార్టనర్ ఇలా ఉండాలి అలా ఉండాలనీ కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా తనకు కాబోయే భార్యలో ఈ లక్షణం మాత్రం ఉండాలి అంటూ గతంలో చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు కాబోయే భార్య తన తల్లిని మంచిగా చూసుకోవాలి .ఎన్టీఆర్ కు తన తల్లి అంటే చాలా ఇష్టం. అందుకే తన తల్లిని కష్టపెట్టకుండా తనని మంచిగా చూసుకునేవారు కావాలని ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఎన్టీఆర్ కోరుకున్న విధంగానే లక్ష్మి ప్రణతి తన తల్లిని ఎంతో మంచిగా చూసుకుంటున్నారని చెప్పాలి. నిజం చెప్పాలంటే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ తల్లిని అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటున్నారని చెప్పాలి. ఇతర హీరోల భార్యల మాదిరిగా లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఈమె గృహిణిగా స్థిరపడి తన పిల్లల బాధ్యతలను అలాగే ఇంటి బాధ్యతలను చక్కబెడుతూ ఉంటారు.
అలాగే తన అత్తయ్యతో లక్ష్మీ ప్రణతితో చాలా మంచిగా ఉంటారని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.