Jr NTR,Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఉంది.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అగ్ర హీరోలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతో మంది రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో కూడా తమకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఎలాగైనా ఎన్నికలలో గెలవాలన్న కసితో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాష్ట్రమంతా తిరుగుతూ తన పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఇకపోతే ప్రజలకు కూడా పెద్ద ఎత్తున మార్పుని కోరుకుంటున్నారు. అందుకే ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి వారి పరిపాలన ఏ విధంగా ఉందో చూడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో మరొకసారి జగన్ కి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన పరిపాలన విధానం ఏ విధంగా ఉంటుందోనని పలువురు భావిస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రజలకు ఇలాంటి నాయకుడు అవసరం అంటూ పవన్ కళ్యాణ్ గురించి తారక్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆయన తెలియజేసారట.

ఈ విధంగా పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎన్టీఆర్ కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారని రాజకీయ విషయాల గురించి ఈయన ప్రస్తావనకు కూడా తీసుకురారని ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమేననీ కొట్టి పారేస్తున్నారు.కొందరు ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ గురించి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారని అభిమానులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus