మరో ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా జూ.ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్ 2018 లో చేసిన ‘అరవింద సమెత’ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసినప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేకపోయింది. అయితే ఈ సారి ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్. ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు జూ.ఎన్టీఆర్. ఒక పక్క ఈ చిత్రంలో నటిస్తూనే మరో పక్క బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ నుండీ ఫోబ్స్ లో పవన్ కళ్యాణ్ తరువాతి స్తానంలో నిలిచాడు ఎన్టీఆర్. దాదాపు సంవత్సరానికి 28 కోట్ల వరకు సంపాదిస్తున్నాడంట మన యంగ్ టైగర్. జూ.ఎన్టీఆర్ ప్రముఖ సంస్థ ‘నవరత్న ఆయిల్’ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సెలెక్ట్ మొబైల్స్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసాడు. ఇప్పుడు మరో సంస్ద కు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేయబోతున్నాడట ఎన్టీఆర్. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ ‘ఆప్పీ ఫీజ్’ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నాడట. దీనికోసం ఎన్టీఆర్ 3 సంవత్సరాలకు గాను దాదాపు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. మొత్తానికి సినిమాల పైన మాత్రమే కాకుండా ఇలా పలు రకాల సంస్దలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు మన హీరోలు. ఇప్పటి వరకూ ఈ కోవలో టాలీవుడ్ నుండీ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ఉండగా… ఇప్పుడు జూనియర్ కూడా జాయిన్ అవ్వడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus