Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీకి అవే హైలెట్ కానున్నాయా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో చరణ్ తారక్ హీరోలుగా నటించగా చరణ్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటే తారక్ మూవీ షూటింగ్ మొదలుకాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. అయితే స్క్రిప్ట్ విషయంలో వర్క్ చేస్తున్న కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్ కు సంబంధించి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని బోగట్టా.

ఇన్నిరోజులు కొరటాల శివ క్లైమాక్స్ పై వర్క్ చేశారని క్లైమాక్స్ అద్భుతంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. 2023 సంవత్సరం సంక్రాంతి టార్గెట్ గా ఈ మూవీ షూటింగ్ జరగనుందని షూటింగ్ ఆలస్యమైతే మాత్రం రిలీజ్ డేట్ మారనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైందని త్వరలో హీరోయిన్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9 కిలోలు బరువు తగ్గుతున్నారు.

ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉండనున్నాయని బోగట్టా. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం అందుతోంది. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీలైతే జులై నెలలోనే ఈ సినిమా షూట్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. తారక్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus