ఎన్టీఆర్ విత్ కే.టి.ఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాంచరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. స్వతహాగా రాంచరణ్, జూ.ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురికి తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ తో మంచి స్నేహ బంధం ఉంది. గతంలో రాంచరణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిగా విచ్చేశాడు కే.టి.ఆర్. ఇక మహేష్-కొరటాల కాంబినేషన్లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సక్సెస్ ప్రమోషన్లలో పాల్గొన్న సంగతి తెలిసందే. ఇక ఇప్పుడు ముగ్గురు స్నేహితులతో ఒకడైన ఎన్టీఆర్ వంతు వచ్చింది.తాజాగా జూ. ఎన్టీఆర్ ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళాడు. అక్క‌డ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.టీ.ఆర్‌తో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ – చల్ చేస్తుంది. కేటీఆర్ టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖుల‌తో ఎంతో స్నేహంగా ఉండడంతో పాటు న్యూ టాలెంట్‌ని కూడా ఎంత‌గానో ప్రోత్సాహిస్తారనే సంగ‌తి తెలిసిందే.

ఇక 2018లో జూ.ఎన్టీఆర్ నుండీ వచ్చిన ఒకే ఒక్క చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం మంచి టాక్ ని రాబట్టుకున్నప్పటికీ .. ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ సాదించలేకపోయింది. అయితే ఇప్పుడు చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ చిత్రంతో తారక్ ఎలాగైనా టాలీవుడ్ రికార్డులు బద్దలుకొట్టాలనే కసి మీద ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. రాజమౌళి చిత్రమంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు టైం తీసుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసాడంట జక్కన్న. ఇక రెండో షెడ్యూల్ ను జనవరి మూడవ వారం నుండీ మొదలుకానుందని టాక్. ఇప్పుటికే మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో.. రాజమౌళి ఇంత ఫాస్ట్ గా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసాడంటే, సినిమా కూడా తొందరగా పూర్తి చేసేస్తాడని అభిమానులు మరిన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ‘బాహుబలి ది బిగినింగ్’ రిలీజ్ టైంకే ‘బాహుబలి 2’ చిత్రం 70 శాతం పూర్తయ్యిందని రాజమౌళి చెప్పగా.. మిగిలిన 30 శాతానికి రాజమౌళి ఇంకో సంవత్సరం టైం తీసుకున్న సంగతి మరిచిపోయినట్టున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus