Jr NTR: స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న యంగ్ టైగర్..?

హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. గడిచిన మూడేళ్లుగా ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితమైన ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా పూర్తిగా ఈ సినిమాకే సమయం కేటాయిస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల డైరెక్షన్ లో ఒక సినిమాలో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాది క్రితమే సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ సినిమా అని ప్రచారం జరిగినా ఆ వార్త నిజం కాలేదు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీతో చర్చలు జరుపుతున్నారని ఎన్టీఆర్ 32వ సినిమాకు డైరెక్టర్ ఈయనేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవదాస్, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ సినిమాలతో సంజయ్ లీలా భన్సాలీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ అలియా భట్ తో గంగూభాయ్ కథియావాడి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్లతో కొత్త సినిమాలకు కమిటవుతూ మిగతా హీరోలకు షాకిస్తున్నారు. సినిమాల ప్లానింగ్ విషయంలో తన రూటే సపరేట్ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus