Jr NTR, Prabhas: ప్రభాస్ వద్దని చెప్పిన ఎన్టీఆర్ వినలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరూ కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. వీరందరూ కూడా తరచూ ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో కనిపిస్తూ ఉంటారు. ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలలో మంచి స్నేహితులగా ఉన్నటువంటి వారిలో ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారు కూడా ఒకరు. ఇద్దరు సినిమాలలోకి రాకముందు నుంచి కూడా మంచి స్నేహితులు. ఇలా వీరి మధ్య స్నేహబంధం ఇప్పటికే కొనసాగుతూనే ఉంది ఏదైనా సినిమా వేడుకలలో ఇద్దరు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

అదేవిధంగా ఒకరికి ఒకరు సినిమాల పరంగా సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా ప్రభాస్ సినిమాల పరంగా ఎన్టీఆర్ కి ఒక సలహా ఇచ్చారట కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్ మాట వినకుండా ఏకంగా కోట్లలో నష్టపోయారని తెలుస్తుంది. ప్రభాస్ రెబల్ సినిమాలో నటించిన అనంతరం గబ్బర్ సింగ్ సినిమా తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రభాస్ వద్దకు రామయ్య వస్తావయ్య అనే కథతో వెళ్లారట ఈ సినిమా కథ చెప్పగానే ఇప్పటికే రెబల్ అనే సినిమా చేశాను

సరికొత్త కథతో రమ్మని ప్రభాస్ హరీష్ శంకర్ ను పంపించేసారట అయితే హరీష్ శంకర్ మాత్రం అదే కథతో ఎన్టీఆర్ ని కలిశారు. కథ వినగానే ఎన్టీఆర్ ఈ సినిమాకు కమిట్ అయ్యారట. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ కమిట్ అయ్యారనే విషయం తెలిసినటువంటి ప్రభాస్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ఈ సినిమా వర్క్ అవుట్ అవ్వదు అసలు కమిట్ అవ్వద్దు అని చెప్పారట

కానీ అప్పటికే దర్శక నిర్మాతల వద్ద ఎన్టీఆర్ (Jr NTR) అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా చేశాడని ఈ సినిమా చేయటం వల్ల భారీగానే నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ మాట వినకుండా ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా వల్ల భారీ నష్టాలు వచ్చాయంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus