Jr NTR: తారక్ ఫ్యాన్స్ కు శుభవార్త.. అందుకే ఆలస్యమట!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిదానంగా సినిమాలలో నటిస్తుండటంపై అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే సంగతి తెలిసిందే. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొనగా తారక్ కొత్త సినిమా షూటింగ్ ఆలస్యం కావడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. అయితే తారక్ సినిమా ఆలస్యం కావడం వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నాయని సమాచారం. తారక్ అభిమానుల ఎదురుచూపులకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ మొదట చెప్పిన కథ బాగానే ఉన్నప్పటికీ ఆ కథ తనకు సూట్ అయ్యే కథ కాకపోవడంతో తారక్ ఆ కథను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఆ తర్వాత కొరటాల శివ మరో అద్భుతమైన లైన్ చెప్పి తారక్ ను ఒప్పించారని బోగట్టా. కథ, కథనాలను పూర్తిగా మార్చడంతో ఈ సినిమా ఆలస్యమవుతోందని అంతకు మించి మరే కారణం లేదని సమాచారం. స్క్రిప్ట్ ఫైనల్ అయిన వెంటనే హీరోయిన్ ను ఫైనల్ చేసి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీ కానున్నారు.

అయితే ఈ సినిమాలతో పాటు తారక్ ఒక బాలీవుడ్ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సరైన సమయం చూసి ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అతి త్వరలో తారక్ షూటింగ్ లతో బిజీ కానున్నారు. ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా రిలీజయ్యే విధంగా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమాసినిమాకు తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. కొరటాల శివ సినిమాతో సక్సెస్ సాధించి తారక్ ఫ్లాప్ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన టాలెంట్ తో తారక్ ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus