Jr NTR: కళ్యాణ్ రామ్ కోసం యంగ్ టైగర్ త్యాగం.. ఆ సినిమాను మిస్ చేసుకున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కథల జడ్జిమెంట్ విషయంలో తారక్ పర్ఫెక్ట్ గా ఉంటారు. తారక్ కెరీర్ లో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నా కథ మరీ ఘోరంగా ఉన్న సినిమాలు తారక్ కెరీర్ లో తక్కువేననే సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా సక్సెస్ కావడానికి కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. కళ్యాణ్ రామ్ ఆర్థికంగా స్థిరపడటానికి తారక్ తన వంతు సహాయసహకారాలు అందించారు.

కళ్యాణ్ రామ్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో పటాస్ ఒకటనే సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కథను అనిల్ రావిపూడి మొదట తారక్ కు చెప్పారట. అయితే తారక్ అప్పటికే టెంపర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పటాస్ సినిమాను కళ్యాణ్ రామ్ తో చేయాలని సూచించడం జరిగింది. పటాస్ మూవీ కథ కళ్యాణ్ రామ్ కు కూడా నచ్చడంతో పటాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

ఈ విధంగా కళ్యాణ్ రామ్ కెరీర్ పుంజుకోవడంలో (Jr NTR) ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉంది. అదే సమయంలో కళ్యాణ్ రామ్ కు పలు సినిమాలు ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టాలను మిగల్చగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిలదొక్కుకునేలా చేశారు. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ నిర్మాతగా మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా నటుడిగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

తారక్, కళ్యాణ్ రామ్ ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటుండగా అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది. తారక్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా కళ్యాణ్ రామ్ పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus