Jr NTR: ఆ సినిమాల రిజల్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తెగ టెన్షన్ పెడుతోందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి కథల విషయంలో ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించే దిశగా తారక్ అడుగులు పడుతున్నాయి. అయితే ఇతర సినిమాలతో పోల్చి చూస్తే వార్2 మూవీ విషయంలో తారక్ మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్2 తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఫైటర్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సంగతి తెలిసిందే. వార్2 కథ, కథనం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు తారక్ పాత్రకు ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మార్చి నెల నుంచి వార్2 మూవీ రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో వరుసగా నటిస్తూ ఉండగా ఆయా సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. ఈ ఏడాదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus