Jr NTR: కన్ఫ్యూషన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏ సినిమా ఎప్పుడు..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు ఎన్టీఆర్. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఈ రెండు సినిమాల గురించే మీడియాతో చెప్పారు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా ముందుగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల శివ కంటే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ‘ఆచార్య’ సినిమాతో కొరటాల ఫేమ్ కాస్త తగ్గింది. ‘కేజీఎఫ్2’ సినిమాతో ప్రశాంత్ నీల్ రేంజ్ పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా అనేసరికి అంచనాలు పెరిగిపోయాయి. కానీ ‘కేజీఎఫ్2’ నిర్మాత ప్లాన్ మాత్రం వేరేలా ఉంది. ఆయన మాటలు వింటుంటే ఇప్పట్లో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యేలా లేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా మొదలుపెడతారని అందరూ భావించారు.

ప్రశాంత్ నీల్ కూడా ఇంటర్వ్యూలలో అదే చెప్పారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్లు ఉంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ‘కేజీఎఫ్’ నిర్మాతలు.. ‘సలార్’ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి అవుతుందని.. ఆ తర్వాత కేజీఎఫ్ 3 లాంచ్ చేస్తామని అన్నారు. 2024లో ‘కేజీఎఫ్3 విడుదల చేసేలా షూటింగ్ మొదలుపెడతామని..

నిర్మాత విజయ్ కె చెప్పారు. ‘సలార్’ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్3’ని నిర్మించేది కూడా ఆయనే. ఇదే ప్రశాంత్ నీల్ ఆలోచన అయితే ఎన్టీఆర్ సినిమా మరింత ఆలస్యమవుతుంది. మరి తన సినిమాల విషయంలో ఇప్పటికైనా ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus