టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తారక్ నటించిన దేవర (Devara) సినిమా రిలీజ్ కానుండగా 2025లో వార్2 2026లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మూవీ విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూవీ హాయ్ నాన్న (Hi Nanna) ఫేమ్ శౌర్యువ్ (Shouryuv) డైరెక్షన్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. దర్శకుడు శౌర్యువ్ ప్రతిభను నమ్మి తారక్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. తారక్ తో సినిమా తీసి శౌర్యువ్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ దర్శకుడి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగే ఛాన్స్ ఉంది. హాయ్ నాన్న సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉండటంతో పాటు ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి.
శౌర్యువ్ రెండో సినిమాకే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించే అవకాశం దక్కిందంటే ఈ దర్శకుడు ఒక విధంగా లక్కీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సినిమాను క్లాస్ సినిమాగా తెరకెక్కించిన శౌర్యువ్ తారక్ తో ఎలాంటి కథాంశంతో సినిమా తెరకెక్కిస్తారో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్లను అందుకుంటున్నారు.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పటినుంచి సెట్స్ పైకి వెళ్తుందనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. శౌర్యువ్ చెప్పిన కథ అద్బుతంగా ఉండటం వల్లే ఎన్టీఆర్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.