Jr NTR: ఆ షోలకు హాజరు కావడం యంగ్ టైగర్ కు ఇష్టం లేదా?

  • February 22, 2023 / 11:43 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో భాషతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్లలో పాల్గొని హంగామా చేశారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ టాక్ షోలలో కూడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ షోకు తారక్ హాజరు కాకపోవడం గురించి జోరుగా చర్చ జరిగింది. బాలయ్యకు తారక్ కు మధ్య గ్యాప్ ఉందని అందువల్లే తారక్ ఈ షోకు హాజరు కాలేదని

కొంతమంది చెప్పగా మరి కొందరు మాత్రం ఆహ్వానం అందకుండా షోకు ఎలా హాజరవుతారని కామెంట్లు చేశారు. అయితే మరో టాక్ షో అయిన నిజం విత్ స్మిత టాక్ షోలో కూడా తారక్ కనిపించలేదు. ఇప్పటికే రిలీజైన ప్రోమోల ద్వారా ఈ షోకు హాజరయ్యే సెలబ్రిటీలకు సంబంధించి స్పష్టత వచ్చేసింది. టాక్ షోలకు హాజరు కావడం తారక్ కు ఇష్టం లేదని అందువల్లే ఈ షోలపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. టాక్ షోలకు హాజరైతే తన సినిమాలకు సంబంధించిన విషయాలను రివీల్ చేయాల్సి ఉంటుందని

తన సినిమాలు రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో వాటిని రివీల్ చేయడం కూడా ఎన్టీఆర్ కు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్30 విడుదల సమయంలోనే తారక్ టీవీ షోలలో, ఓటీటీ షోలలో, ఇతర షోలలో సందడి చేసే ఛాన్స్ ఉందని సమాచారం. తారక్ సినిమా షూట్ శరవేగంగా జరగనుందని తారక్ జాన్వీ కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా చరిత్రను తిరగరాయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కథల విషయంలో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus