Jr NTR: వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో తారక్ బిజీ.. ప్లాన్ అదిరిందిగా!

హృతిక్ రోషన్ (Hrithik Roshan) , ఎన్టీఆర్ (Jr NTR) ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్2 సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. తారక్ ఈ సినిమా కోసం లుక్ మార్చుకుంటుండగా ఏప్రిల్ నెల నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. వార్2 సినిమాలో తారక్ రోల్ నిడివి తక్కువే కాగా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. అయితే వార్2 పూర్తైన వెంటనే తారక్ సోలో హీరోగా వార్2 సినిమాను నిర్మించిన బ్యానర్ లో వార్3 తెరకెక్కనుందని తెలుస్తోంది.

టైటిల్ వార్3 అని కచ్చితంగా చెప్పలేం కానీ సోలో హీరోగా తారక్ తో సినిమా అయితే ప్లానింగ్ లో ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో తారక్ బిజీ అవుతున్న నేపథ్యంలో (Devara) దేవర2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో తెలియాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు సినిమాలలో తారక్ నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

వార్2, వార్3 హిట్టైతే బాలీవుడ్ లో కూడా తారక్ బిజీ అవుతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పారితోషికం కంటే మంచి రోల్స్ కే ప్రాధాన్యత ఇస్తూ తారక్ అడుగులు వేస్తున్నారు. కథ, కథనం విషయంలో అస్సలు రాజీ పడని తారక్ ప్రతి సినిమా సక్సెస్ సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అనుకున్న సమయానికే తన సినిమాలను రిలీజ్ చేయాలని తారక్ భావిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల సినిమాలు వాయిదా పడుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాలలో నటించి వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus