Jr NTR: న్యూయార్క్ రెస్టారెంట్ లో సందడి చేసిన ఎన్టీఆర్.. ఫోటో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ఏ హాలిడే వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పటికీ ఈయన మాత్రం అందరి హీరోల మాదిరిగా తన హాలిడే వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను పెద్దగా అభిమానులతో పంచుకోరు. అయితే తాజాగా ఈయన యూఎస్ఏ లోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్లో సందడి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ రెస్టారెంట్ సిబ్బందితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

అయితే ఇక్కడ కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉండడం విశేషం. ఎన్టీఆర్ తన భార్య పిల్లలను పెద్దగా సోషల్ మీడియాకు పరిచయం చేయడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ ఫోటో దిగడమే కాకుండా ఇలా ఇంటర్నేషనల్ ట్రిప్ లో కూడా తాను ఇండియన్ ఫుడ్ రుచి చూశానని, తెలియజేస్తూ ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ తారక్ యూఎస్ఏ పర్యటనలో ఉన్న ఆయన ఇండియన్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపించడం గమనార్హం. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తారక్ అమెరికా పర్యటనలోనే ఉన్నట్టు తెలుస్తుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus