Jr NTR: వైరల్ అవుతున్న ఎన్టీఆర్- కొడాలి నాని ల పాత ఫోటో..!

వైసిపి ఎమ్మెల్యేలు అయిన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్, కొడాలి నాని లతో మన ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. 2009 ఆ టైంలో కొడాలి నాని, వంశీ లకు టీడీపీ లో సీట్లు ఇప్పించింది కూడా ఎన్టీఆరే.2014 ఎన్నికల టైంలో వారు వైసీపీ పార్టీకి షిఫ్ట్ అవ్వడం.. దీంతో ఎన్టీఆర్.. కొంత నారా, నందమూరి ఫ్యామిలీ లకు వ్యతిరేకంగా మారడం.. అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టే ఉంటున్నారు.

టికెట్ రేట్ల ఇష్యు గురించి మహేష్, ప్రభాస్, చిరు వెళ్లి జగన్ ను కలిసిన టైంలో ఎన్టీఆర్ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్.. వెళ్తే రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని లైట్ తీసుకున్నట్లు కూడా కథనాలు వినిపించాయి. రాజకీయ ఉచ్చులోకి పడకూడదు అని ఎన్టీఆర్ ఎంత ట్రై చేసినా ఏదో ఒక విషయం పై అతను రాజకీయాలకు సంబంధించిన వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్‌…కొడాలి నాని,వల్లభనేని వంశీ మోహన్ లతో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటో పాతదే అయినప్పటికీ ఎప్పుడూ చూడని అద్భుతం చూసినట్టు ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక ఈ ఫొటోలో ఎన్టీఆర్ త‌న కాలిని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ దర్జాగా కూర్చున్నాడు.ఎన్టీఆర్ తన కాలి పై కాలేసినప్పటికీ అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా ఈ ఫోటో ఉంది. పక్కనే వల్లభనేని వంశీ చిరున‌వ్వులు చిందిస్తూ హైలెట్ గా నిలిచాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus