Jr NTR Remuneration: ప్రభాస్ కు గట్టి పోటీ ఇస్తున్న తారక్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ గురించి ప్రేక్షకుల మధ్య తరచూ చర్చ జరుగుతుంటుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో మిగతా హీరోల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ కు తారక్ గట్టి పోటీని ఇస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. 2018 సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన అరవింద సమేత తరువాత తారక్ మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ మినహా మరో సినిమా చేయలేదు.

అందువల్ల ఆర్ఆర్ఆర్ సినిమాకు తారక్ ఎక్కువమొత్తం రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ గత సినిమాల రెమ్యునరేషన్ తో పోలిస్తే ఆర్ఆర్ఆర్ సినిమాకు డబుల్ రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రభాస్ తరువాత ఆ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎన్టీఆర్ మాత్రమేనని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత సినిమాలకు ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో తరువాత సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించనున్నారని సమాచారం.

పాన్ ఇండియా హీరోగా ఎదిగే విధంగా ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ తరువాత సినిమాల డైరెక్టర్ల జాబితాలో అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నారని వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus