Jr NTR: అలాంటి రిస్క్ చేయబోతున్న యంగ్ టైగర్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుండటం గమనార్హం. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ఎన్టీఆర్ నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సైఫ్ కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఒక రిస్కీ సీన్ ఉందని డూప్ లేకుండా అండర్ వాటర్ సీన్ ఫైట్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమాకు హైలెట్ అనేలా ఈ సీన్స్ ఉంటాయని బోగట్టా. సముద్రం అడుగున తారక్ రిస్క్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సినిమాల కోసం తారక్ ఎంతో కష్టపడతారని దానికి సంబంధించి ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. (Jr NTR) ఎన్టీఆర్ సైఫ్ కాంబో సీన్లు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కుతున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

కథల ఎంపికలో గతంతో పోల్చి చూస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ కథ నచ్చకపోతే సినిమాను రిజెక్ట్ చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయని సమాచారం అందుతోంది. తన టాలెంట్ కు తగ్గ విజయాలు దక్కాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus