Jr NTR: అట్లీ అలా.. బుచ్చిబాబు ఇలా, ఎన్టీఆర్ హ్యండిచ్చేసినట్టే..!

  • June 5, 2021 / 08:11 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఆర్.ఆర్.ఆర్ సినిమా మొదలుపెట్టక ముందే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అనేక సార్లు అట్లీ చెన్నై నుండీ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలవడంతో.. వీళ్ళ కాంబో ఫిక్స్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అటు తర్వాత విజిల్( తమిళ్ లో బిగిల్) ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్ తో నా నెక్స్ట్ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.

వైజయంతి మూవీస్ వారు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ముందుకొచ్చారు. కానీ స్క్రిప్ట్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదు కాబట్టి.. అట్లీ షారుక్ ఖాన్ తో మూవీ ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా పరోక్షంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్టు ని నిర్మిస్తారని కూడా ప్రచారం జరిగింది.

నాన్నకు ప్రేమతో సినిమా టైం నుండీ బుచ్చిబాబు , ఎన్టీఆర్ లకు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలు ఫిక్స్ అని అధికారిక ప్రకటన వచ్చింది. అవి పూర్తవ్వడానికి 2023 వరకూ టైం పడుతుంది.దీంతో బుచ్చిబాబు కూడా వేరే హీరోలను అప్రోచ్ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus