రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాను సౌత్ లో రాజమౌళి ప్రెజంట్ చేస్తుండడంతో తెలుగులో కూడా సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఇప్పటికే రణబీర్, అలియా, కరణ్ జోహార్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెండు, మూడు సార్లు హైదరాబాద్ కి వచ్చారు. ఈ ప్రమోషన్స్ తో మరింత క్రేజ్ తీసుకురావడానికి హైదరాబాద్ లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు కూడా చేశారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవడంతో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతుంది. తీరా చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వెంటనే పార్క్ హయత్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడే సమయంలో ముందుగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
వినాయకచవితి కారణంగా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదని.. ఒక దేశ పౌరుడిగా వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి వారు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈవెంట్ అక్కడ చేయలేకపోయామని.. అందుకే ఇలా చిన్న వేదికపై మీ ముందు ఉన్నామని అన్నారు.
అలానే నేషనల్ మీడియా, తెలుగు మీడియాకి కూడా సారీ చెప్పారు. ఇదే ఈవెంట్ లో తమ నుంచి బెస్ట్ కంటెంట్ కోసం ఆడియన్స్ చూస్తున్నారని.. వారి అంచనాలకు తగ్గట్లు బెస్ట్ ఫిలిమ్స్ అందించాలని అన్నారు. ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి క్వాలిటీ ఫిలిమ్స్, బెస్ట్ సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర