Jr NTR, Chiranjeevi: చిరు వ్యాఖ్యల పై కొరటాలకు మద్దతుగా నిలిచిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. నిజానికి ఈయన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ వేడుక వాయిదా పడటంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ డైరెక్టర్లకు చిన్నపాటి క్లాస్ పీకిన విషయం మనకు తెలిసిందే.

డైరెక్టర్లు సెలబ్రిటీల డేట్స్ క్లాష్ అవుతాయన్న ఉద్దేశంతో కంటెంట్ పై దృష్టి పెట్టకుండా సినిమా హడావిడిగా చేస్తూ విడుదల చేయటం వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయని అందుకు తానే ఉదాహరణ అంటూ ఆచార్య సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారు. చిత్ర పరిశ్రమ ముందుకు నడవాలంటే పూర్తి బాధ్యత డైరెక్టర్లదే అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.

ప్రపంచ సినీ పరిశ్రమ ఒత్తిడిలో ఉందని ఇలాంటి సమయంలో సినిమా ఫ్లాప్ అయితే ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని,సినిమా ప్రేక్షకులకు నచ్చాలంటే డైరెక్టర్లు మాత్రమే కాదు ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలంటూ తారక్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు కచ్చితంగా చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారని పలువురు భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివకు మద్దతు తెలిపారు.

ఇక ఎన్టీఆర్ కొరటాల శివ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. త్వరలోనే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో మరో సినిమా రానున్న నేపథ్యంలో ఇలా కొరటాల శివకు ఎన్టీఆర్ మద్దతు తెలిపారని కొందరు భావిస్తున్నారు.మొత్తానికి బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus