Jr NTR, Pranathi: భార్యని ముద్దు పెట్టుకుంటున్న ఎన్టీఆర్ ..వైరల్ అవుతున్న ఎన్టీఆర్ – ప్రణతి ల రొమాంటిక్ ఫోటో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ … ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు ఎన్టీఆర్ సినిమా వచ్చి 3 ఏళ్ళు అయ్యింది. ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ .. కొమరం భీమ్ గా కనిపించింది ఆకట్టుకున్నాడు. నార్త్ లో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు కొమరం భీముడో.. పాటలో ఎన్టీఆర్ నటనకి ఓవర్సీస్ ఆడియన్స్ సైతం మంత్రముగ్దులు.. అయిపోయారు. ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు అంటూ ప్రకటన వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు కూడా అధికారిక ప్రకటన వచ్చింది. అది కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. దాని సంగతి ఏంటో నిర్మాతలకే. తెలీదు. సరే షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్ లు వెళ్ళడం పనిగా పెట్టుకున్నాడు. మొన్నామధ్య ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ల కోసం జపాన్ మొత్తం తిరిగొచ్చాడు. ఇప్పుడు మళ్లీ యూఎస్ వెళ్ళాడు.

అక్కడ మియామీ బీచ్ హోటల్ లో భార్య లక్ష్మీ ప్రణతిని ముద్దుపెట్టుకుంటూ రొమాంటిక్ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో అతని పెద్ద కొడుకు భార్గవ్ రామ్ తీసినట్టు ఉన్నాడు. అందుకే బ్లర్ గా వచ్చింది. అయితేనేం ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus