Jr NTR: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

  • August 3, 2022 / 12:27 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తారక్ 30 అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో తారక్ అభిమానులు ఫీలవుతున్నారనే సంగతి తెలిసిందే. కొరటాల శివ ఆచార్య ఫలితం, ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్ కు గురయ్యానని ఈ కారణం వల్లే ఎన్టీఆర్30 అంతకంతకూ ఆలస్యమవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ తర్వాత ప్రాజెక్ట్ ను ఆలస్యం చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్ ఒకే సమయంలో కొరటాల శివ డైరెక్షన్ లో బుచ్చిబాబు డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటిస్తూ రెండు పడవల ప్రయాణం చేయాలని తారక్ భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఆగష్టు 26 నుంచి కొరటాల శివ తారక్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఒక్కో సినిమాకు తారక్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తారక్ అడిగితే మరింత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తో తారక్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడంతో తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు తెలుగుతో పాటు హిందీ, ఇతర దక్షిణాది భాషల్లో విడుదల కానున్నాయి.

కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలు తారక్ రేంజ్ ను మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించరని తెలుస్తోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus