Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ షూ కాస్ట్ ఎంతో తెలుసా?

నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ యూత్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. తారక్ సినిమాల గురించి, ఫ్యామిలీ, ముఖ్యంగా కిడ్స్ అభయ్ రామ్, భార్గవ రామ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, పిక్ లేదా వీడియో కనిపించినా దాన్ని ఎంతలా వైరల్ చేస్తారో.. ట్రెండ్ చేస్తారో తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజులుగా ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ క్యాపిటల్ టోక్యోలో ఉన్నాడు.

అక్కడ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గరి నుండి.. ఫ్యాన్స్ తో మీట్ అవడం.. ఫొటో గ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ ఇవ్వడం లాంటి వీడియోస్.. వైఫ్ లక్ష్మీ ప్రణతితో తీసుకున్న పిక్చర్స్.. ఇలా ప్రతి చిన్న మూమెంట్ ని అప్ డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు తమ ఫేవరెట్ యాక్టర్ కి సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.. ఆ న్యూస్ జూనియర్ వేసుకున్న షూ కాస్ట్ గురించి..

ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు తను వేసుకున్న షూ కాస్ట్ గురించి, అలాగే పాండమిక్ టైంలో పెట్టుకున్న మాస్క్ రేటు గురించి న్యూస్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ట్రిపులార్ ప్రమోషన్స్ లో యంగ్ టైగర్.. ఎయిర్ జోర్దాన్ బ్రాండ్ కి సంబంధించిన 1 హై పారిస్ సెయింట్ జెర్మన్ షూస్ (Air Jordan 1 High Paris Saint Germain) వేసుకున్నాడు. వెంటనే ఈ బ్రాండ్ షూస్ Price ఏంతనేది సెర్చ్ చేశారు.

తారక్ వేసుకున్న ఈ షూ ధర 34, 999 రూపాయలన్న మాట. ‘‘స్లిమ్ గా తయారై, సూపర్ స్టైలిష్ లుక్ లో యంగ్ టైగర్ ఏమున్నాడ్రా బాబూ’’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. జపాన్ లో జూనియర్ స్టైలిష్ పిక్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ‘‘కొరటాల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్ డేట్ ఇవ్వడం ఆలస్యం అయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుండు చాలన్నా’’ అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

1

2

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus