Jr NTR, Klin Kaara: దీపావళి స్పెషల్ రామ్ చరణ్ కూతురు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన తారక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ అందరిని కూడా ఆహ్వానించి ఘనంగా దీపావళి సెలబ్రేషన్స్ తన ఇంట్లో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ వేడుకలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరై సందడి చేశారు. ఇక రామ్ చరణ్ కుమార్తె కోసం పలువురు స్టార్స్ అందరూ కూడా వివిధ రకాల కానుకలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన సంగతి మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ కూతురి కోసం ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చారట. రామ్ చరణ్ కూతురు ప్రస్తుతం బొమ్మలను గుర్తిస్తూ ఆడుకొని వయసుకు వచ్చారు. ఈ క్రమంలోనే తనకోసం స్పెషల్ గా కొన్ని రకాల టాయ్స్ గిఫ్ట్ సెట్ మొత్తం తీసుకు వచ్చారని తెలుస్తోంది.

ఈ టాయ్స్ గిఫ్ట్ లో వివిధ రకాల బొమ్మలు ఉన్నాయని అయితే ఇవి ఐదు సంవత్సరాల వరకు ఆడుకునే విధంగా ఉపయోగపడతాయని సమాచారం. యూస్ అండ్ త్రో టాయ్స్ ఉపాసన పెద్దగా ఇష్టపడదు. అందుకే ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే తన కుమార్తె కోసం ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇక ఈ వేడుకకు హాజరైనటువంటి మహేష్ బాబు దంపతులు కూడా క్లిన్ కారా కోసం బహుమతులు తీసుకువచ్చారు.

అందరికన్నా ఎన్టీఆర్ (Jr NTR) తీసుకువచ్చిన గిఫ్ట్ చాలా స్పెషల్ గా ఉందంటూ ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ దివాళి సెలబ్రేషన్స్ లో భాగంగా హీరోలందరూ కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ వేడుకలలో పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus