Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సులువుగానే ఆ టార్గెట్ ను సాధిస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవర సినిమా కోసం రేయింబవళ్లు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా దేవర సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం దేవర సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఆ లక్ష్యాన్ని సాధిస్తానని జూనియర్ ఎన్టీఆర్ కాఫిడెన్స్ తో ఉన్నారు. ఉగాది, ఇతర పండుగల సెలవులు సైతం ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ కానున్నాయని సమాచారం అందుతోంది.

సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత వార్2 రిలీజ్ కానుండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సైతం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కొన్ని నెలల గ్యాప్ లోనే వార్2, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

దేవర1 (Devara) విడుదలైన తర్వాత దేవర2 సినిమా షూటింగ్ కు సంబంధించి, ఇతర వివరాల గురించి అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దేవర1 ను మించి దేవర2 ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ త్వరలో మొదలుకానుండగా అనిరుధ్ వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందని వార్తలు వస్తున్నాయి. దేవర మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus