“బిగ్ బాస్” మొదటి సీజన్ ను అత్యంత నేర్పుతో, ఓర్పుతో నిర్వహించిన ఎన్టీయార్ సదరు షో తెలుగులో ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే సీజన్ 2కి కూడా ఎన్టీయార్ చేత హోస్టింగ్ చేయించాలనుకొన్నారు. కానీ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల వల్ల అది కుదరలేదు. “బిగ్ బాస్” తర్వాత ఎన్టీయార్ మరో బుల్లితెర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీయార్ ను సెలక్ట్ చేశారట. ఈమేరకు ఒప్పందం కూడా పూర్తయ్యిందట.
త్వరలోనే ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించి ప్రోమోస్ ను ఎన్టీయార్ తో షూట్ చేయనున్నారు. మ్యాచ్ ల ప్రసారం గురించిన ప్రోమోస్ లో కనిపించడం ద్వారా ఐపీఎల్ మ్యాచ్ లకు తారక్ ప్రమోటర్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
బిగ్ బాస్ హోస్టుగా ఆకట్టుకున్న నేపథ్యంలో తారక్ కు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి. టీవీ చానళ్లు తమ ప్రోగ్రామ్స్ ను ప్రమోట్ చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఇలా సినిమా స్టార్స్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పుడు తారక్ కూడా ఇలాంటి సెలబ్రిటీల జాబితాలో చేరాడు.