భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కావడానికి మరో 8 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాకు అదనపు ప్రయోజనాలు చేకూరేలా చేయాలని రాజమౌళి, డీవీవీ దానయ్య సీఎం జగన్ ను కలిశారనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కొన్నిరోజుల క్రితం జరిగిన సమావేశంలో జగన్ ను కలవాల్సిన సెలబ్రిటీల జాబితాలో ఎన్టీఆర్ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తారక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే తాజాగా సీఎం జగన్ కు ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారని ఆ కాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు బెనిఫిట్ కలిగేలా తారక్ రిక్వెస్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ తో రాజమౌళి, దానయ్య భేటీ అయిన సమయంలోనే ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారని బోగట్టా.
గతంలో జరిగిన సమావేశానికి హాజరు కాకపోవడానికి సంబంధించి జగన్ కు తారక్ కారణాలను వెల్లడించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ వీడియో కాల్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కు సన్నిహితుడైన వైసీపీ మంత్రి ఒకరు రాజమౌళి, దానయ్యలకు సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరికేలా చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ లేదా రాజమౌళి స్పందిస్తే మాత్రమే వైరల్ అయిన వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. అఖండ సినిమా సమయంలో బాలయ్య కూడా జగన్ ను కలిసే ప్రయత్నం చేశారని మంత్రి పేర్ని నాని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి కొన్నిరోజుల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ రిక్వెస్ట్ కు ఏపీ సీఎం ఓకే చెప్పారో లేదో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!