Jr NTR: ఎన్టీఆర్ నెంబర్ 1 హీరో అని తేల్చేసిన ఆర్మాక్స్ సంస్థ..!

  • August 16, 2022 / 04:15 PM IST

ప్రఖ్యాత ఆర్మాక్స్ మీడియా సంస్థ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బాగా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ ఎవరు అనే అంశం పై ప్రతి నెల సర్వే నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 2022 కు గాను తెలుగులో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఎవరు అనే అంశం పై సర్వే నిర్వహించింది. ఈ ఫలితాల్లో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకోవడం విశేషం.

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కొమరం భీమ్ గా అద్భుతమైన నటన కన పరిచినందుకు గాను ఎన్టీఆర్ దేశ, విదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓ పక్క ఎన్టీఆర్ ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కథనాలు పుట్టుకొస్తున్న సమయంలో ఇలాంటి వార్తలు వినిపిస్తూ ఉండడం… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఖుషి చేసే అంశం. ఎన్టీఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెంబర్ 2 ప్లేస్ ను దక్కించుకున్నాడు.

అటు తర్వాత అల్లు అర్జున్ నెంబర్ 3 ప్లేస్ ను దక్కించుకోగా రాంచరణ్ 4 వ ప్లేస్ ను, మహేష్ బాబు 5వ ప్లేస్ ను దక్కించుకున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్లో రాబోతున్న మూవీ ఇది. ఆల్రెడీ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ అవ్వడం దానికి సూపర్ రెస్పాన్స్ లభించడం జరిగింది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus