Jr NTR, Pranathi: ఎన్టీఆర్ భార్య మేకోవర్ చూశారా.. వైరల్ అవుతున్న లక్ష్మీ ప్రణతి లేటెస్ట్ ఫోటో!

ఎన్టీఆర్ మళ్ళీ విదేశాలకు వెళ్ళాడు. ప్రస్తుతం అతను తన భార్య పిల్లలతో కలిసి న్యూయార్క్ లో ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది. ఆ ఫోటోని ఈరోజు ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘ఎంజాయింగ్ ఎ న్యూయార్క్ మినట్’ అంటూ తన భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇందులో లక్ష్మీ ప్రణతి మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెప్పాలంటే హీరోయిన్లలా చాలా ట్రెండీగా ఉంది.

హీరోయిన్ ఓ పాటలో షూటింగ్ చేసి బ్రేక్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫోజు ఇచ్చింది లక్ష్మీ ప్రణతి. టైట్ జీన్స్, నీ హై షూస్ ధరించి.. స్టైలీష్‌ లుక్‌ తో న్యూయార్క్ రోడ్ల పై కనిపించింది లక్ష్మీ ప్రణతి. మొన్నటికి మొన్న ఓ ఫంక్షన్లో కాస్ట్ లీ పట్టు చీర కట్టుకుని, ఎక్కువ నగలు పెట్టుకుని ఓ దేవతలా కనిపించిన లక్ష్మీ ప్రణతి.. ఇప్పుడు పూర్తిగా వేరే లుక్ లో కనిపించడంతో ఈ ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. తన్న భార్యతో దిగిన ప్రతి ఫోటోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

తన భార్య అంటే ఎంత ఇష్టమో ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు వంటి షోలలో చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో తరచూ ఫోటోల ద్వారా ఆ ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఈ ఫోటో అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus