Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

సినీ పితామ‌హుడి బ‌యోపిక్ లో ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్నట్టు కొన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు అది హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. సినీ పితామహుడిగా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రూపొందుతుందట. నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli)  సమర్పణలో ‘మ్యాక్స్ స్టూడియోస్’ అధినేత వరుణ్ గుప్తా, ఎస్.ఎస్.కార్తికేయ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఇందులో దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి జూ.ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది.

Jr NTR

ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యిందట. ఇటీవల ఎన్టీఆర్ కు ఫుల్ నెరేషన్ ఇవ్వగా.. ఎన్టీఆర్ (NTR) కూడా ఎక్సయిట్ అయినట్లు తెలుస్తుంది. ఇండియన్ సినీ పరిశ్రమ అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో వచ్చిన ఆటంకాలను ఇందులో చూపించబోతున్నారట. రెండేళ్ల క్రితమే ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. మొదట ఓ మీడియం బడ్జెట్ సినిమాగా తీయాలని అనుకున్నారు. కానీ తర్వాత దీని స్పాన్ పెరగడంతో..

స్టార్ తో చేస్తే.. దీని వరల్డ్ వైడ్ ఉంటుందని రాజమౌళి భావించినట్టు తెలుస్తుంది. అందుకే ఎన్టీఆర్ ను రాజమౌళి అప్రోచ్ అయ్యి ఈ ప్రాజెక్టు కోసం ప్రిపేర్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్. పైగా పాన్ ఇండియా స్టార్. రాజమౌళి నమ్మకం అదే. అందుకే ఎన్టీఆర్ తో ఈ ప్రాజెక్టు చేయాలని డిసైడ్ అయిపోయారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడిస్తారు.

స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus