‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఎన్టీఆర్ వర్కౌట్లు…!

జూనియర్ ఎన్టీఆర్.. అందరి దర్శకులతో ఏమో కానీ.. రాజమౌళి సినిమా అంటే చాలా యాక్టివ్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటాడు. తన కెరీర్లో ‘స్టూడెంట్ నెం1’ తో మొదటి హిట్ అందుకున్నా… ‘సింహాద్రి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టినా… ఇక వరుస ప్లాపులతో ఉన్నప్పుడు ‘యమదొంగ’ చిత్రంతో మళ్ళీ హిట్టందుకున్నా… అది మొత్తం రాజమౌళి వలనే అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే తారక్ కూడా ‘నాతో ఎప్పుడు సినిమా చేస్తావ్’ అంటూ రాజమౌళిని ప్రతీ ఈవెంట్ లోనూ తినేసేవాడు. ‘ఊసరవెల్లి’ ఆడియో రిలీజ్ లో అయితే కారు నెంబర్ కూడా చెప్పి.. ‘ఆపేసి అడగండి’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అంతలా వారి మధ్య అనుబంధం నెలకొంది. ఈరోజుతో ‘సింహాద్రి’ సినిమా విడుదలయ్యి 16 సంవత్సరాలు పూర్తయ్యింది. ఇన్నాళ్ళకు మళ్ళీ ఎన్టీఆర్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు జక్కన్న.

‘ఆర్.ఆర్.ఆర్’ లో కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. జిమ్ లో నిత్యం వర్కౌట్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. కోచ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ లో కొమురం భీమ్ పాత్ర కోసం బాడీని సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా జిమ్ లో హార్డ్ గా తారక్ కష్టపడుతున్న ఓ ఫోటోని స్టీవెన్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ‘మనకు కావాల్సిందానికి మించి ఇస్తాడు’ అంటూ రాసుకొచ్చి ‘కొమరం భీమ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ అంటూ ట్యాగ్ లు కూడా ఇచ్చాడు స్టీవెన్స్. అయితే ఈ ఫొటోలో ఎన్టీఆర్ కాలు మాత్రమే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోని చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus