టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ కి ఎంతో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా చిన్న కుమారుడు భార్గవ్ రామ్. వీరిద్దరికి సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అచ్చం ఎన్టీఆర్ పోలికలతో ఉన్నటువంటి ఈ బుడ్డోడు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారో.
ఇకపోతే ఒక స్టార్ హీరో పిల్లలకు తన నాన్న ఫేవరెట్ గా ఉంటారు. కానీ (Jr NTR) ఎన్టీఆర్ పిల్లలకు మాత్రం ఎన్టీఆర్ తమ ఫేవరెట్ హీరో కాదంటూ ఓ సందర్భంలో ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ మీ అబ్బాయిలకు మీరు కాకుండా బయట హీరోలలో ఎవరంటే ఇష్టం అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ ఏదైనా సినిమా బాగుందని టాక్ వస్తే తప్పకుండా అభయ్ రామ్ ఆ సినిమా చూస్తారని ఎన్టీఆర్ తెలిపారు.
ఇక భార్గవ్ రామ్ అయితే కేవలం అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే చూస్తారని తెలిపారు.. అల్లు అర్జున్ అంటే భార్గవ్ కి చాలా ఇష్టం. అందుకే తన సినిమాలు బాగా చూస్తారని ఇక కరోనా సమయంలో పుష్ప సినిమాలోని డైలాగ్స్ డాన్స్ చాలా బాగా ఇష్టపడ్డారంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయాన్ని తాను అల్లు అర్జున్ కు కూడా చెప్పాను అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!