తారక్ కొత్త సినిమా డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఫుల్ జోష్ లో ఉన్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో ఇచ్చిన విజయానందంతో జనతా గ్యారేజ్‌ ఎంతో ఉత్సాహంతో పూర్తి చేశారు. హిట్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  సెప్టెంబర్‌ 2న విడుదల కానుంది. సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో కాజల్ “నేను లోకల్ ” అనే ప్రత్యేక పాటలో అందాలు ఆరబోయనుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే తారక్ మరో సినిమా బిజీలో పడిపోనున్నారు. అశోక్‌, ఊసరవెల్లి, టెంపర్‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ఫిల్మ్ ని ఎన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. నందమూరి అన్నదమ్ముల కలయికలో వస్తున్న ఈ చిత్రం ట్రెండ్ సృష్టిస్తుందని అభిమానులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus