బాలీవుడ్ ను ఆశ్చర్యపరిచిన ‘జంగిల్ బుక్’ కలెక్షన్లు..!

రుడ్యార్డ్ కిల్పింగ్ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది జంగిల్ బుక్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 15 న విడుదల అవుతుండగా.. ఒకవారం ముందుగానే ఏప్రిల్ 8 న ఈ చిత్రం భారత్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.9.76 కోట్లు వసూలు బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందని, 2016 లో విడుదలైన చిత్రాల్లో ఎయిర్ లిఫ్ట్ తరువాత అత్యధిక మొదటి రోజు వసూలు చేసిన రెండో చిత్రమని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్ అక్కౌంట్ లో పేర్కొన్నాడు. హిందీ వర్షన్ లో విడుదల అయిన ఈ చిత్రానికి బాలీవుడ్ దిగ్గజ నటులు నానా పటేకర్, ఓంపురి, షేఫాలి షా, ఇర్ఫాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలు వాయిస్ ఓవర్ అందించారు. జాన్ ఫేవరూ దర్శకత్వంలో డిస్నీ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus