బూతు డైలాగు చెప్పడంపై జ్యోతిక సమాధానం!

తమిళ డైరక్టర్ బాలా సినిమాలను సహజత్వానికి చాలా దగ్గరగా తీస్తారు. సమాజంలో జరిగే విషయాలను వందశాతం కళ్లకు కడుతారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు.  “నాచియార్‌” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిరంజీవితో “ఠాగూర్‌”, నాగార్జునతో “మాస్‌”, రవితేజతో “షాక్‌” సినిమాలు చేసిన ఈమె సూర్యతో పెళ్లి అయిన తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వివాహం అనంతరం చేసిన మొట్ట మొదటి చిత్రం “నాచియార్‌” . ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి వివాదాస్పదమయింది. పోలీస్ పాత్రలో ఉన్న జ్యోతిక చెప్పిన బూతు డైలాగ్ విమర్శలు గుప్పించాయి.

ఆమెతో అటువంటి డైలాగ్ చెప్పించడం ఏమిటి ? అంటూ అభిమానులు బాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ మీడియా కూడా దీనిపై కథనాలను ప్రచురించింది. సెన్సార్ వాళ్ళు తప్పకుండా ఆడైలాగును మ్యూట్ చేస్తారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి కేంద్ర బిందువు అయిన దీనిపై జ్యోతిక లేటెస్ట్ గా స్పందించారు. “అది సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం. దర్శకుడు చెప్పేటప్పుడు వినడానికే ఇబ్బందిగా అన్పించింది. కానీ, సీన్‌లోని టెంపో అలాంటిది.. తప్పలేదు. సెన్సార్‌ వుంది కదా.. తప్పయితే తీసేస్తుంది” అంటూ జ్యోతిక వివరణ ఇచ్చింది. మరి సెన్సార్ ఎటువంటి నిర్ణయం తీసుకుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus