కిరణ్ అబ్బవరంకి యూత్..లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా కొంత మంచి పేరు ఉంది. ‘రాజావారు రాణిగారు’ ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి అచ్చమైన,స్వచ్ఛమైన టైటిల్స్ తో సినిమాలు చేసి హిట్లు అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. ‘క’ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కూడా అతనికి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ హెల్ప్ అవ్వడం వల్లనే అని చెప్పాలి.
అయితే ఎందుకో అతను తన మార్క్ సినిమాలు చేసి సేఫ్ జోన్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు అనిపిస్తుంది. తప్పేమీ లేదు హీరో అన్నాక అన్ని రకాల సినిమాలు చేయాలి. కానీ అతని ప్లస్ పాయింట్స్ వదిలి వేరే ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి కిరణ్ అబ్బవరంకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ‘నేను మీకు బాగా కావలిసిన వాడిని’ ‘మీటర్’ ‘దిల్ రుబా’ ‘రూల్స్ రంజన్’ వంటి సినిమాలు అన్నీ కిరణ్ అబ్బవరం.. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన సినిమాలే. అన్నీ నిరాశపరిచాయి.
ఇప్పుడు ‘K-RAMP’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా అతని శైలికి పూర్తిగా భిన్నంగా ఉన్న సినిమా అని ప్రమోషనల్ కంటెంట్ తో హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే టైటిల్లోనే చాలా డబుల్ మీనింగ్ ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది.తాజాగా ‘K-RAMP’ నుండి టీజర్ వదిలారు. ఇందులో కిరణ్ అబ్బవరం పాత్ర చాలా బోల్డ్ గా కనిపిస్తుంది.
నాన్ స్టాప్ గా బూతులు.. హీరోయిన్ తో లిప్ లాక్..లతో ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. యుక్తి తరేజా గ్లామర్ ఈ టీజర్ కి హైలెట్ అయ్యింది అని చెప్పాలి. వెన్నెల కిషోర్, సాయి కుమార్,మురళీధర్ గౌడ్ వంటి ఆర్టిస్టులు టీజర్లో ఉన్నప్పటికీ.. కిరణ్ అబ్బవరం బూతులు, యుక్తి తరేజా గ్లామరే హైలెట్ అయ్యింది అని చెప్పాలి.
మరి ఈ నెవర్ బిఫోర్ బోల్డ్ అవతార్లో కిరణ్ అబ్బవరం ఎంతవరకు మెప్పిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతానికి టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :