K.Vijayendra Prasad: పూరి జగన్నాథ్ నా శత్రువు

సీనియర్ మోస్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలను ఎంత బలంగా అందిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తనయుడు రాజమౌళి సినిమాలకు కథలన్నింటిని కూడా దాదాపు ఆయనే అందించారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆయనను కథల కోసం సలహాల కోసం ఎప్పటికప్పుడు టచ్ చేస్తుంటారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా K. విజయేంద్రప్రసాద్ ను మెర్సల్ సినిమా కోసం స్క్రీన్ ప్లే రాయించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అందరికి దగ్గరగా ఉండే విజయేంద్రప్రసాద్,

పూరి జగన్నాథ్ అంటే చాలా అసూయ అని చెబుతుంటారు. అతనే తన శత్రువు అని మరోసారి ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఎప్పటికి అతన్ని చూసి అసూయ పడాలని తన ఫోన్ లో కూడా పూరి జగన్నాథ్ ఫొటోను వాల్ పేపర్ గా సెట్ చేసుకున్నట్లు అలీతో సరదాగా షోలో ఓపెన్ గా చెప్పేశారు. విజయేంద్రప్రసాద్ అలా చెప్పడానికి కారణం ఉంది. ఇన్ డైరెక్ట్ గా పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టమని,

ఎందుకంటే పూరి సినిమాలో ఒక ఫైట్ సీన్ రాబోతోంది అంటే దానికంటే ముందే ప్రేక్షకుల్లో కొట్టాలని ఒక ఫీల్ ను కలిగిస్తాడు. ఆ లైన్ పట్టుకోవడం రైటర్స్ కు చాలా కష్టం. ఆ విషయంలో నేను చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని గత ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు అలీతో సరదాగా షోలో కాస్త విభిన్నమైన అభిమానాన్ని చాటుకున్నారు.


ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus