పా .రంజిత్ దర్శకత్వంలో రెండోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమా గత గురువారం రిలీజ్ అయి మిశ్రమస్పందన అందుకుంది. ఈశ్వరరావు, నానా పటేకర్, హుమా క్కురేషి తదితరులు నటించిన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసింది. అయినా ఇది కబాలి కలక్షన్స్ కంటే తక్కువే. ఓవర్సీస్లో 322 లొకేషనల్లో విడుదలై.. రెండు రోజుల్లోనే వన్ మిలియన్ డాలర్ల మార్క్ ని దాటి రికార్డు సృష్టించింది. అయితే సినిమా రజినీకాంత్ అభిమానుల మినహా ఇతరులను మెప్పించలేకపోవడంతో రెండో రోజు నుంచి కలక్షన్స్ తగ్గుకుంటూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం 3. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన తరువాత 3 రోజుల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
ఈ చిత్రం నాలుగు రోజులకు గాను 6.5 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక వీక్ డేస్ లో కలక్షన్స్ మరింత పడిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాగే జరిగితే భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు చూసే వీలుంది. పా .రంజిత్ రజినీ ఇచ్చిన రెండో అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న 2 .o చిత్రంపై దీని ప్రభావం పడనుంది.