దుల్కర్ సల్మాన్,భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో రానా దగ్గుబాటి, సముద్రఖని అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కాంత’.సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పణలో దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించారు.
ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి టీజర్, ట్రైలర్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ అంతా ఓ పాత సినిమాని పోలి ఉండటం వల్ల ‘కాంత’ పై బజ్ ఏర్పడలేదు. అందువల్ల ఈ సినిమాకి బిజినెస్ కూడా సో సోగానే జరిగింది.
ఒకసారి ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
| నైజాం | 2 cr |
| సీడెడ్ | 0.50 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.5 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 5 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
| ఓవర్సీస్ | 0.25 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 5.5 కోట్లు(షేర్) |
‘కాంత'(Kaantha) (తెలుగు వెర్షన్) సినిమాకు రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కాంత’ సినిమాపై ఎటువంటి బజ్ లేదు. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. స్ట్రాంగ్ పాజిటివ్ మౌత్ టాక్ కావాలి. అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది. మరి నవంబర్ వంటి అన్ సీజన్లో ‘కాంత’ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.