బహుబలి తో ‘కబాలి’ కి పోటి??

  • July 19, 2016 / 09:50 AM IST

సినిమా అంటేనే కల్పన…అయితే ఒక మనిషి కల్పనలోనుంచి పుట్టే సినిమాల రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం. అలాంటిది మయ సినిమా ఆ సినిమాను దాటేస్తుంది. రికార్డులను బ్రేక చేస్తుంది అని ఏ రకంగా మాట్లాడతారో కానీ…మొత్తానికి రికార్డుల విషయానికి వచ్చేసరికి అందరి కళ్ళు ఇప్పుడు ‘బాహుబలి’పైనే ఉన్నాయి. టాలీవుడ్ టాప్ హిట్ గా నిలిచిన బాహుబలి ఎంతటి అఖండ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఈ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చెయ్యాలి అని ప్రగల్భాలు పలికిన టాప్ హీరోల సినిమాలు డిజాస్టర్స్ గా మారిపోయిన సంధర్భాలు చూశాం. అయితే ఇప్పుడు మా సినిమా కూడా బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అంటున్నాడు మన “కబాలి” నిర్మాత కలైపులి ఎస్.థాను. విషయంలోకి వెళితే…బాహుబలిని టార్గెట్ చేస్తూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి. రజినీకాంత్ ‘కబాలి’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని దీనికి కారణం రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయస్సుల వాళ్ళు అభిమానులుగా ఉన్నారని దీనివల్ల ‘బాహుబలి’ రికార్డులను ఈజీగా బ్రేక్ చేయగల సత్తా ‘కబాలి’ కి ఉంది  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఎస్. థాను.

కొంతవరకు బాగానే ఉన్నా..అసలు చిక్కు ఏంటి అంటే…ఒక పక్క కబాలి పై అంచనాలు భారీ స్థాయిలో పేరిపోతూ ఉండడంతో, మరోపక్క ఈ సినిమాపై రకరకాల న్యూస్ వినిపిస్తున్నాయి…ఈసినిమా ప్రోమో వీడియోస్‌లో పెద్దగా కమర్షియల్‌ కోణం కన్పించక పోవడంతో పాటు కేవలం ‘కబాలి’ స్టైలిష్ సినిమా మాత్రమే అన్న విమర్శలు, అదే కోణంలో మాస్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాల ఉన్నా ఇది కేవలం క్లాస్ సినిమానె అన్న విమర్శ సైతం మార్కెట్ లో ఉంది. మరి వీటన్నింటినీ అధిగమించి సినిమా ఎలాంటి సక్సెస్ ను కొడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus